రెండో పెళ్లి డేట్ ప్రకటించిన సింగర్ సునీత

టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత రెండో పెళ్లి డేట్ ప్రకటించింది. జనవరి 9న పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపింది. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని సునీత దర్శించుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన పెళ్లి డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. 10 నెలల అనంతరం స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, జనవరి 9న పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపింది.

sunitha and ram veerapaneni

తనకు మంచి జీవితాన్ని అందించాలని స్వామివారిని కోరుకున్నట్లు సునీత చెప్పింది. ఈ నెలలోనే రామ్ వీరపనేనితో సునీత ఎంగేజ్‌మెంట్ పూర్తవ్వగా.. డిసెంబర్ చివరి వారంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ తమ జాతకానికి తగ్గట్లు మంచి ముహూర్తాల లేకపోవడంతో జనవరిలో చేసుకోవాలని నిర్ణయించారు. ఇటీవల ఫ్రెండ్స్, సన్నిహితులకు సునీత, రామ్ జంట ఒక ప్రైవేట్ హోటల్‌లో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చింది.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కరోనా క్రమంలో కొంతమంది ఫ్రెండ్స్, సన్నిహితుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని సునీత, రామ్ నిర్ణయించుకున్నారు.