దీపికా పదుకొణెకు ఎన్నో అవమానాలు

బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ల అందరిలో దీపికా పదుకొణే తొలి స్థానంలో ఉంటుంది. బాలీవుడ్‌లోని స్టార్ హీరోల అందరితో నటించిన ఆమెకు పెళ్లి తర్వాత ఆఫర్స్ మరింతగా పెరిగిపోయాయి. ఆమె కాల్‌షీట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికీ అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరోయిన్ దీపికా కావడం విశేషం.

DEEPIKA PADUKONE

అయితే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయంలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి తాజాగా దీపికా పదుకొణే బయటపెట్టింది. దీపికా నటించిన తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’ విడుదలై ఇటీవల 13 ఏళ్లు అయింది. తొలి సినిమాలోనే షారూఖ్‌తో కలిసి దీపికా నటించగా.. ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆమె ఫిల్మ్‌పేర్ అవార్డు దక్కించుకుంది. కానీ ఆ సినిమాలో తన నటనను చూసి చాలామంది ఎగతాళి చేశారని, తన యాసపై కామెంట్లు చేశారని చెప్పింది.

తనకు నటించడం రాదని, నటనకు పనికి రానని చాలామంది విమర్శలు చేశారని దీపికా చెప్పింది. మోడలింగ్ నుంచి వచ్చిన తాను నటనకు పనికిరానంటూ చాలామంది విమర్శించారని దీపికా చెప్పింది. ఆ విమర్శల్ని చూసి మళ్లీ సినిమాల్లో నటించకూడదని అనిపించిందని, ఆ అవమానాల్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని తప్పుల్ని సరిదిద్దుకున్నానని దీపిక తెలిపింది.