జానపద గాయకుడు మొగిలయ్య కన్నుమూత

జానపద గాయకుడు మొగలియ్య అంటే తెలియని తెలుగు ప్రేక్షకులే ఉండరు. ఇటీవల కొద్ది కాలం నుండి కిడ్నీ సంబంధిత అలాగే గుండె వ్యాధితో బాధపడుతున్న ఆయన కొంతకాలంగా హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. అనారోగ్యంతో వరంగల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న మొగిలయ్య ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో తెలంగాణ ప్రభుత్వం మొగిలయ్యకు వైద్య సదుపాయాల కోసం హైదరాబాద్ తరలించడం జరిగింది. బలగం సినిమా ద్వారా పాపులర్ గా మారిన మొగిలయ్య చిరంజీవి గారి దగ్గర ఉండి కూడా ఆర్థిక సాయం పొందడం జరిగింది. అయితే నేటి తెల్లవారుజామున మొగిలయ్య కనుముసారు. మొగిలయ్య మరణ వార్త విన్న బలగం చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు అలాగే ఆ చిత్ర బృందం, నటీనటులు అంతా వారి మరణానికి సంతాపం తెలియజేశారు.

గతంలో నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొగిలయ్య సాహిత్యానికి ముగ్ధుడై ఆయనను కలవడం జరిగింది.