సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) తన 12వ ఎడిషన్‌తో సౌత్ ఇండియన్ సినిమాలోని బెస్ట్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమౌతోంది. SIIMA సౌత్ ఇండియన్ సినిమాకి నిజమైన ప్రతిబింబం, గ్లోబల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫ్యాన్స్‌ని సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్‌కి కనెక్ట్ చేస్తుంది. SIIMA 2024 2023 క్యాలెండర్ ఇయర్ లో విడుదలైన చిత్రాల నుంచి నామినేషన్లను అనౌన్స్ చేసింది.
SIIMA 2024 ఈవెంట్ 2024 సెప్టెంబర్ 14 ,15 తేదీల్లో దుబాయ్‌లో జరగనుంది.
SIIMA చైర్‌పర్సన్ బృందా ప్రసాద్ అడుసుమిల్లి 2023లో విడుదలైన చిత్రాలకు SIIMA నామినేషన్‌లను అనౌన్స్ చేశారు. నామినేషన్ల గురించి బృందా ప్రసాద్ మాట్లాడుతూ “గత రెండు సంవత్సరాలుగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ లాంగ్వేజ్ బారియర్ ని అధిగమించి జాతీయ స్థాయిలో విజయాన్ని సాధించారు. SIIMA 2024 స్ట్రాంగ్ కంటెడర్స్ లిస్టు ని కలిగి ఉంటుంది’
దసరా (తెలుగు), జైలర్ (తమిళం), కాటేరా (కన్నడ), 2018 (మలయాళం) మోస్ట్ పాపులరిటీ కేటగిరీలలో SIIMA నామినేషన్‌లలో ముందున్నాయి.
తెలుగులో నాని, కీర్తి సురేశ్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘దసరా’ 11 నామినేషన్లతో ముందంజలో ఉండగా, నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ 10 నామినేషన్లతో క్లోజ్ గా ఉంది.
తమిళంలో రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ 11 నామినేషన్లతో ముందంజలో ఉండగా, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘మామన్నన్’ 9 నామినేషన్‌లతో దగ్గరగా వుంది.
కన్నడలో, దర్శన్ నటించిన తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ‘కాటెరా’ 8 నామినేషన్లతో ముందంజలో ఉండగా, రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన ‘సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ’ 7 నామినేషన్లతో దగ్గరగా ఉంది.
మలయాళంలో, టోవినో థామస్, ఆసిఫ్ అలీ నటించిన జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ‘2018’ 8 నామినేషన్లతో ముందంజలో ఉండగా, మమ్ముట్టి మరియు జ్యోతిక నటించిన ‘కథల్ – ది కోర్’ 7 నామినేషన్లతో దగ్గరగా ఉంది.
ఆన్‌లైన్ ఓటింగ్ విధానం ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు.