సినీ నటులు సిద్ధార్థ్, అతిథి రావు వివాహం చేసుకున్నారు. మొదట వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటూ కొన్ని రూమర్లు రాగా ఆ తరువాత అది నిజమే అంటూ వాళ్ళే అధికారికంగా ప్రకటించడం జరిగింది. కొన్ని రోజులపాటు ఇరువురి ఫోటోలు నెట్ ఇంట వైరల్ గా మారాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు వారిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు సిద్ధార్థ్, అతిథి రావు తమ కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల ఆధ్వర్యంలో దక్షిణ భారత దేశపు సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న పిమ్మట వారి వివాహ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటోలను చూసిన అభిమానులు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా సూర్యుడు నువ్వే… నా చంద్రుడు నువ్వే… నా నక్షత్రాలు నువ్వే… అనే క్యాప్షన్ తో అతిధి సిద్ధార్థ పై తనకు ఉన్న ప్రేమను తెలుపుతూ ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. 400 సంవత్సరాల చరిత్ర గల వనపర్తిలోని ఓ దేవాలయంలో వీరి విహావం జరిగింది.