కార్గిల్ వీరుడి హీరోయిక్ కథతో ‘షేర్షా’

1999 కార్గిల్ యుద్ధంలో పరం వీర్ చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం, ప్రయాణాన్ని ‘షెర్షా’లో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో బాత్రా పాత్రను సిద్దార్థ్ మల్హోత్రా పోషించనున్నారు. ‘పంజా’ ఫేమ్ విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. కరణ్ జోహార్ ప్రొడక్షన్ బ్యానర్ ధర్మ ఎంటర్టైన్మెంట్, కాష్ ఎంటర్టైన్మెంట్ ‘షెర్షా’ను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఆగస్టు 12న ఈ చిత్రం ప్రీమియర్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కార్గిల్ వార్ హీరో విక్రమ్ బాత్రా ఒరిజినల్ ఫుటేజ్ ని వాడుతూ కట్ చేసిన ఈ టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. విష్ణు వర్ధన్ స్టైలిష్ మేకింగ్ ఈ మూవీకి బాగా హెల్ప్ అయ్యేలా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం టీజర్‌ను ట్వీట్ చేస్తూ ‘మా హృదయాలలో ప్రేమ, ప్రైడ్, ఆనందంతో మేము షెర్షా కథను మీకు అందిస్తున్నాము’ అని అన్నారు. షెర్షా సినిమాకి పోటిగా స్టార్ హీరోగా అజయ్ దేవగన్ నటించిన భుజ్ మూవీ రిలీజ్ కానుంది. రెండు ఆర్మీ బేస్డ్ కథలే అయినా ఒకటి అమెజాన్ ప్రైమ్ లో, ఇంకొకటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కావడం విశేషం. ఈ ఇండిపెండెన్స్ డే సంధర్భంగా ఈ రెండు మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి.