టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఇటీవల విడుదలైన క్రాక్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించగా.. ప్రస్తుతం ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. మరోవైపు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ బిజీబిజీగా మారింది. ఇవాళ బర్త్ డే జరుపుకుంటున్న ఈ బ్యూటీ.. తాజాగా కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కెమెరాలకు చిక్కింది.
గతంలో లండన్‌కి చెందిన మైఖేల్ కోర్సలేతో శృతిహాసన్ ప్రేమ వ్యవహారం నడిపింది. కొన్ని సంవత్సరాల పాటు వీరిద్దరు డేటింగ్లో కూడా గడిపారు. కుటుంబ సభ్యులకు కూడా అతడిని శృతిహాసన్ పరిచయం చేసింది. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అతడికి విడిపోయిన శృతిహాసన్.. ఇప్పుడు కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతోంది. తాజాగా రోడ్డుపై కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించింది. ఈ ఫొటోలో ప్రియుడి చేతిని పట్టుకుని రోడ్డ దాటేందుకు ప్రయత్నిస్తూ ఉంది.