Shriya: శ్రియ “గ‌మ‌నం” రిలీజ్ డేట్ ఫిక్స్‌

Shriya: ప్ర‌ముఖ న‌టి శ్రియ‌చ‌ర‌ణ్ త‌న అపురూప అందం, అభిన‌యంతో దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు సినీ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.. పెళ్లి త‌ర్వాత కాస్తా బ్రేక్ ఇచ్చిన శ్రియ మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చింది. ఇక శ్రియ న‌టిస్తున్న తాజా చిత్రం గ‌మ‌నం. ఇందులో Shriya శ్రియ చీర క‌ట్టుకుని, మెడ‌లో మంగ‌ళ‌సూత్రం వేసుకుని ఓ సాధార‌ణ గృహిణిగా క‌నిపించ‌నుంది. ఈ సినిమాలో Shriya శ్రియ‌నే కీల‌క‌మ‌ని.. ఆమె ఒక విభిన్న‌మైన పాత్ర‌ను పోషిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

gamanam release date

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఈ సినిమాకు సంబంధించ‌న పోస్ట‌ర్లు, టీజ‌ర్‌లు ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రిస్తోంది. ఈ చిత్రంలో శివ కందుకూరి, నిత్యామీన‌న్‌, ప్రియాంక జ‌వాల్క‌ర్ త‌దితరులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. Shriya ఈ చిత్రానికి సుజనారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ర‌మేశ్‌, వెంకీ పుష‌డ‌పు, జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించ‌గా.. తాజాగా ఈ సినిమా మార్చి19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా స్వ‌రాలు అందిస్తున్నారు.