అతివేగంగా అద్భుతంగా పుష్ప ఈవెంట్ చేసిన శ్రేయాస్ మీడియా

సోమవారం రాత్రి హైదరాబాద్ నగరంలోని పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప ఈవెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈవెంట్ చేయాలని ఆలోచన కేవలం 24 గంటల ముందు మాత్రమే నిర్ధారణ కావడంతో అతి తక్కువ సమయంలో పోలీసుల దగ్గర నుండి పర్మిషన్ తీసుకుని శ్రేయాస్ మీడియా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చేశారు. అది ఎలా అంటే ఆదివారం రాత్రి ఈవెంట్ కి పర్మిషన్ వచ్చిన వెంటనే సోమవారం రాత్రి నాటికి శ్రేయాస్ టీం అంతా కలిసి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తూ ఎంతో వేగంగా పాసుల ప్రింటింగ్ దగ్గర నుండి మొదలుకొని ప్రతి చిన్న విషయంలోనూ ఎటువంటి తప్పిదం రాకుండా జాగ్రత్త పడుతూ ఇటీవల కాలంలోనే హైదరాబాదులో ఎక్కడ జరగనంత ఘనంగా ఈ ఈవెంట్ జరిగేలా చూశారు. ఈవెంట్ పూర్తయ్యే వరకు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా జాగ్రత్త పడుతూ ఇటువంటి భారీ ఈవెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ శ్రేయాస్ మీడియా చేసి చూపించారు.