నటి హేమ కు షాక్

ఇటీవలే బెంగుళూరు రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. బెంగళూరు లో జరిగిన ఓ రేవ్ పార్టీలో రైడ్ జరగగా కొంత మంది తెలుగు సినీ నటులు కూడా ఆ పార్టీ లో పాల్గొన్నారు అని విషయం తెలిసింది. అందులో భాగంగానే తెలుగు సినీ నటి హేమ కూడా దొరికినట్లు వార్తలు రావడం తో నటి హేమ వెంటనే తాను ఒక ఫార్మ్ హౌస్ ఉన్నట్లు, తనకి రేవ్ పార్టీ కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ ఓ వీడియో విడుదల చేసారు. ఇది ఇలా ఉండగా హేమ రేవ్ పార్టీ లో దొరికినప్పుడు తీసిన ఫోటోను బెంగుళూరు పోలీసులు విడుదల చేసారు. తప్పుడు ప్రచాచారం చేస్తున్నందుకు చర్యలు కూడా తప్పవంటూ ఉంటుంది అని నెటిజన్లు కామెంట్ చేసారు.

అయితే ఈరోజు ఉదయం మా అసోసియేషన్ సభ్యురాలు అయిన కరాటే కళ్యాణి మా ఎలక్షన్ ల సమయంలో తనని పేకాట ఆడుతూ దొరికింది అంటూ తనని టార్గెట్ చేసి హేమ మాట్లాడారు అని, ఇప్పుడు రేవ్ పార్టీ లో హేమ దొరికింది, ఇప్పుడు హేమ ని ఎం అనాలి అన్నారు. టెస్ట్ కి వెళ్లిన బ్లడ్ శాంపిల్ రెసుల్త్ పాజిటివ్ గా వస్తే తప్పని సరిగా మా అసోసియేషన్ తరపున తనపై చర్యలు ఉంటాయని అన్నారు. ఇది ఇలా ఉండగా టెస్టింగ్ కు పంపిన రక్త పరీక్షలలో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ గా రెసుల్త్ వచ్చింది. తనతో పాటు మొత్తం 87 మంది ఆ రేవ్ పార్టీ లో డ్రగ్స్ తీసున్నట్లు సమాచారం. కాగా దీని పై మా అసోసియేషన్ సభ్యురాలైన కరాటే కళ్యాణి అన్నట్లు నటి హేమ పై ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో వేచి చూడాల్సిందే.