Bollywood: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే శుభాకాంక్షలు చెప్పెవరకు అంతా బాగానే ఉంది కానీ శిల్పాశెట్టి చెప్పిన దాంట్లో బొక్కలున్నాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ ట్రోలింగ్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. నిన్న జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా..
Bollywood శిల్పాశెట్టి సోషల్ మీడియా వేదికగా దేశప్రజలందరికీ గణతంత్రదినోత్సవం కాకుండా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక దీంతో సోషల్ మీడియాలో గణతంత్రానికి స్వాతంత్రానికి కూడా తేడా తెలియదా? అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్. అయితే దీనికి సంబంధించిన పోస్ట్‌ను Bollywood శిల్పాశెట్టి తన పొరపాటును గమనించి ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే పాత పోస్ట్‌లను షేర్ చేసి సెటైర్లు వేశారు నెటిజన్స్.