Tollywood: ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శశి’. సురభి నాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి, యంగ్ హీరోస్ నాగశౌర్య, సందీప్ కిషన్, విశ్వక్ సేన్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో సురభి, రాశీ సింగ్, సాయి కుమార్, చంద్రబోస్, అనంత్ శ్రీరామ్, భాస్కర భట్ల తదితరులు పాల్గొన్నారు.
Tollywood అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. శశి సినిమాలో ఎడబాటు పాటను రాశాను. మీకు (ఆడియెన్స్) నాయికా నాయికలను విడగొడితే నచ్చదని తెలుసు. కానీ దర్శకులు నాతో ఈ పాట రాయించారు. అరుణ్ మున్ముందు చేసే పాటలన్నింటిలో ముఖ్యమైన పది పాటల్లో నా ఈ పాట ఉంటుంది. చంద్రబోస్ గారు రాసిన ఒకే ఒక లోకం పాట ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంటే.. నా పాట మాత్రం వారిని అలా కూర్చోబెడుతుంద’ని అన్నారు.
Tollywood భాస్కరభట్ల మాట్లాడుతూ.. ‘దీంతానా దీంతానా అనే పాటను రాశాను.. నాకు సాయి కుమార్, ఆది ఇద్దరూ కూడా మిత్రులు. ఇద్దరూ కూడా భయ్యా అని పిలుస్తుంటారు. ప్రతీ రోజూ పాట ఎన్ని మిలియన్లు క్రాస్ చేసిందనే అప్డేట్లు ఇస్తుంటాడు. నా పాట హిట్ అవ్వడంతో ఆది చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు
Tollywood కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. నాకు, హీరో ఆది గారికి ఓ పరోక్ష సంబంధం ఉంది. నాకు పెళ్లాక భార్యతో చూసిన మొదటి సినిమా ప్రేమ కావాలి. ప్రతీ ఒక్కరి జీవితంలో స్నేహం, ప్రేమ రెండు ఘట్టాలుంటాయి. ఓ ఇద్దరు కలుసుకుంటే స్నేహం.. కలిసిపోతే ప్రేమ. అదే ఈ సినిమా. మార్చి 19వ తేదీన ఈ మూవీ సక్సెస్ అవుతుంది.. మీరంతా దానికి సాక్షులుగా ఉంటార’ని అన్నారు.
Tollywood డీఓపీ అమర్ మాట్లాడుతూ… కరోనా తరువాత ఇలా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.. 2012 అనేది మా టీంకు ఎంతో గొప్పగా ఉంటుందని అనిపిస్తోంది.. ఇక్కడికి వచ్చిన వారందరికీ థ్యాంక్స్ అని అన్నారు.
Tollywood మాటల రచయిత రవి మాట్లాడుతూ.. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత వర్మ గారికి ఎంతో రుణపడి ఉంటాను.. శశి సికిమా కోసం పని చేసిన అంరదికీ మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
అన్నీ కలిసి వచ్చాయ్..
Tollywood సందీప్ కిషన్ మాట్లాడుతూ.. హీరో ఆదికి అన్నీ కలిసి వచ్చాయ్. టీజర్‌ను చిరంజీవి గారు.. ట్రైలర్‌ను కళ్యాణ్ గారు విడుదల చేశారు. సిధ్ శ్రీరామ్ పాడిన పాట సూపర్ హిట్ అయింది. అన్నీ కలిసి వచ్చాయ్.. ఈ సినిమాలో సురభి అందంగా కనిపించింది.. శశి టీంకు ఆల్ ది బెస్ట్. మార్చి 19న అందరూ శశి సినిమాను చూడండి’ అన్నారు.
నిర్మాతలకు మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది..
Tollywood సంగీత దర్శకుడు అరుణ్ మాట్లాడుతూ.. గిటార్ ప్లేయర్‌గా కెరీర్ సాగుతోన్న సమయంలో శ్రీనివాస నాయుడు గారు ఫోన్ చేశారు. మామూలుగా రాత్రంతా పని చేయడం వల్ల ఉదయాన్నే పడుకుంటాం. అలా ఉదయం ఆరు గంటలకు పడుకుంటున్న సమయంలో శ్రీనివాస్ నాయుడు గారు ఫోన్ చేసి శశి గురించి చెప్పారు. పది నిమిషాల్లో ఇంటికి వస్తాను అని చెప్పేసి వచ్చారు. సినిమా ఐడియా నచ్చడంతో చేస్తాను అని చెప్పాను. ముందుగా దీంతానా అనే ట్యూన్ ఇచ్చాను. అలా ఈ సినిమాకు నన్ను పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం చేసిన ఆరు పాటలు కూడా అన్నీ ఒక వర్షన్‌కే ఓకే చేశారు మా నిర్మాతలు. వారికి ఉన్నంత మ్యూజిక్ సెన్స్ నేను ఎవరిలోనూ చూడలేదు. నేను చెప్పిన సమయానికి ఇవ్వలేకపోయినా నిర్మాతలు ఎప్పుడూ ఏమీ అనలేదు. ఈ సినిమాను సిధ్ శ్రీరామ్ మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. ఈ సినిమాకు అందరూ అద్భుతంగా పని చేశార’ని అన్నారు.
సిధ్ శ్రీరామ్ మాట్లాడుతూ.. మీ అందరి ముందు ఇలా ఉండటం ఎంతో సంతోషంగా ఉంది.. మార్చి 19న ఈ మూవీ రాబోతోంది అందరూ చూడండి.. తెలుగు అభిమానులందరికీ థ్యాంక్స్` అన్నారు.
ఆ విజయ పరంపరలో శశి కూడా చేరాలి..
Tollywood రానా మాట్లాడుతూ.. ‘ నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం సాయి కుమార్ గారు. ఇప్పుడు అందరికీ ఆన్ లైన్ క్లాసులు తెలుస్తున్నాయ్. కానీ నాకు మాత్రం నా మొదటి చిత్రం నుంచి ఆన్ లైన్ క్లాసులున్నాయ్.. నా ఆన్ లైన్ క్లాసులు సాయి కుమార్ గారివే. ఆయన పిలిచిన నిమిషం నేను వచ్చేయాలి.. వేరే దారి లేదు. ఈ ఏడాది ఇండియన్ సినిమాను మొదలుపెట్టేసింది టాలీవుడ్. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ విజయ పరంపరలో శశి కూడా చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆది కి ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మార్చి 19న మాస్కులు వేసుకుని థియేటర్‌కు వెళ్లండి.. శశి సినిమాని ఎంజాయ్ చేయండి“ అన్నారు.
రాజీవ్ కనకాల వీడియో సందేశాన్ని పంపించారు – ‘శశి సినిమా మార్చి 19న రాబోతోంది. ఎన్నో విశేషాలున్నాయ్.. థియేటర్‌కు వచ్చి సినిమాను చూసి మా ఆదిని, దర్శకుడు శ్రీనివాస్ నాయుడిని అందరినీ ఆశీర్వదించండి. ఇందులో మంచి పాత్రను చేశాను. సినిమా ఆసాంతం ఎంజాయ్ చేస్తారు.. శశి ఒక అందమైన లవ్ స్టోరీ’ అని చెప్పుకొచ్చారు
కెరీర్లో మంచి సినిమాగా నిలిచిపోవాలి..
బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. ‘నేను, ఈ మూవీ డైరెక్టర్ నాయుడు, భరత్ కమ్మ అందరం కూడా సుకుమార్ గారి శిష్యులం. నాయుడన్నా సుక్కు సార్‌కు మంచి పేరు తీసుకురావాలి. సాయి కుమార్ గారు ఫోన్ చేశారు.. రమ్మని అడిగారు.. మీ వాయిస్ కోసం వచ్చేశాను.. ఆదికి కెరీర్లో మంచి సినిమాగా నిలిచిపోవాలి. శశి టీంకు ఆల్ ది బెస్ట్.. చంద్రబోస్ గారు ఒకే పాటతో లోకమంతా మీరే అనిపించారు. ఓపెనింగ్స్ బీభత్సంగా ఉండాలని కోరుకుంటున్నాను` అన్నారు.
థియేటర్లు దద్దరిల్లిపోవాలి..
దర్శకుడు చంద్రమహేష్ మాట్లాడుతూ.. ‘శశిపెద్ద హిట్ అవుతుందని కచ్చితంగా చెప్పగలం.. చాలా కసిగా చేశారు.. దర్శకుడు శ్రీనివాస్ నాయుడు తపనతో చేశాడు.. మ్యూజిక్, ఫోటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.. గ్యారెంటీగా పెద్ద హిట్ అవుతుంది.. ఫస్ట్ డైరెక్టర్‌కి చంద్రబోస్ పాటలు రాస్తే సూపర్ హిట్ అవుతుంది.. అది సెంటిమెంట్.. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అలాగే మా రానా బాబు వచ్చిన ప్రతీ సినిమా హిట్ అవుతుంది.. నా సినిమాకు కూడా రానా గారే క్లాప్ కొట్టాడు. అలా ఆ సెంటిమెంట్‌తో కూడా చెబుతున్నాను.. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి.. మార్చి 19న థియేటర్లు దద్దరిల్లిపోవాలి’ అన్నారు.
సినిమా మీద గట్టిగా దాడి చేయండి
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఆది అన్నా కాల్ చేశాడు.. సిగ్నల్ బ్రేక్ చేసి మరీ వచ్చాను. ప్రేమ కావాలి సినిమా కాలేజ్ బంక్ చేసి మరీ కూడా చూశాను.. అన్న నన్ను కాల్ చేసి పిలవడంతో ఆ రోజులన్నీ గుర్తుకు వచ్చాయ్.. కోవిడ్ తరువాత థియేటర్ల మీద ప్రేక్షకులు దాడి చేస్తున్నారు.. సినిమా పరిశ్రమ రికవరీ కాదని చాలా మంది అంటే నేను అందరితో ఫైట్ చేశాను.. కాని ఆడియెన్స్ రైట్ అని నిరూపించారు. ఈ సినిమాకు కూడా బాక్సాఫీస్ మీద దాడి చేయాలి
అని అన్నారు.
ఈ సినిమా కూడా కొట్టేయాలి..
నాగశౌర్య మాట్లాడుతూ.. ‘కోవిడ్ తరువాత పరిశ్రమ ఎప్పుడు కోలుకుంటుందా? అని చాలా ఆలోచించాం. మా పని అయిపోయిందనుకున్నాం.. ఆ డిప్రెషన్లోనే 8 ప్యాక్స్ కూడా చేశాను.. తెలుగోడిలా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. సినిమా రిలీజ్ అయితే తెలుగు ప్రేక్షకులు సినిమాకు వెళ్లినంతగా ఎవ్వరూ వెళ్లలేదు.. మీరిచ్చిన ఈ సపోర్ట్‌కు మేం ఎంత చేసినా తక్కువే. ఈ సినిమా హిట్ అవ్వాలని చాలా బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిర్మాత మా అన్నయ్యే..ఆ డబ్బులన్నీ నాకే వస్తాయి. ఆది.. అంత ఈజీగా డ్యాన్స్ ఎలా చేస్తారు? అనేది ఇప్పటికీ నాకు అంతు పట్టని విషయం. శశి సినిమా మరో ఛలో అవుతుంది. ఓ పాట హిట్ అయింది.. సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఒకే ఒక లోకం అనే పాట హిట్ అయింది.. శశి కూడా ఛలో కంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతీ నెల ఓ సినిమా వచ్చి గట్టిగా కొడుతోంది.. ఈ సినిమా కూడా కొట్టేయాలి.. మ్యూజిక్ డైరెక్టర్, రచయితలు అందరూ అద్భుతంగా చేశారు. శశి టీంకు ఆల్ ది బెస్ట్’ అన్నారు.
ఆది మాట్లాడుతూ – ‘తెలుగు ఇండస్ట్రీ రికవరీ అయింది ప్రేక్షకుల వల్లే. నా బర్త్ డే నాడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మ్యాచోగా ఉన్నావ్ అని చిరంజీవిగారు అన్నారు. అలా చెప్పడంతో హ్యాపీగా అనిపించింది. చిన్నప్పటి నుంచి నేను అమితంగా ఇష్టపడే వ్యక్తి ఆయన. తమన్, హరీష్ శంకర్, నాని నా పాటలను రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. అందరు హీరోల అభిమానుల సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన హీరోలందరికీ థ్యాంక్స్. డైరెక్టర్ శ్రీనివాస్ వచ్చి కథ చెప్పినప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాను. డీఓపీ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కెరీర్ బెస్ట్ సాంగ్ ఇచ్చిన అరుణ్‌కు థ్యాంక్స్. నాకు ఫస్ట్ టైం చంద్రబోస్ రాసిన ఈ పాట ఇంత సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. శశి కోసం పని చేసిన అందరికీ థ్యాంక్స్. మార్చి 19న ఈ మూవీ రాబోతోంది. అందరూ చూడండి’ అన్నారు.
బొమ్మ వేరేలా ఉంటుంది…
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ.. ‘జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను.. ఒక వేదిక కావాలి.. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే.. ఆరుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. వారి గురించి జీవితాంతం రుణపడి ఉంటాను.. శశి మా నిర్మాత మొండి పట్టుదల. ఎక్కవఖర్చు పెట్టి ఈ సినిమాను ఇలా తీసుకున్నారు.. సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు.. సక్సెస్ వస్తదో.. ఫెయిల్ అవుతుందో తెలీదు కానీ చెడ్డపేరు రాకుండా సినిమా తీయాలనే మాట చెప్పారు. అది ఎప్పటికీ మరిచిపోలేను. టీజర్ రిలీజ్ చేసి చిరంజీవి గారు చిన్న పుష్ ఇచ్చారు.. పవన్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేసి పెద్ద హైప్ ఇచ్చారు. సినిమాకు ఇంత పాపులారటీ వచ్చిందంటే కేవలం చంద్రబోస్ గారి వల్లే. పాటల రచయితలందరికి థ్యాంక్స్. ఈ సినిమాకు నలుగురు పిల్లర్స్. అమర్ భయ్య ఫోటోగ్రఫీ.. సత్యజీ ఎడిటింగ్.. అరుణ్ మ్యూజిక్.. రవి డైలాగ్స్ అదిరిపోయాయి. చిత్రానికి పనిచేసిన అందరికీ థ్యాంక్స్. ఇప్పటి వరకు మీరు ఆదిని చూశారు.. బొమ్మ వేరేలా ఉంటుంది. మిగతా వారి గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను’ అని అన్నారు.
ఈ మూవీతో మరో హిట్ రాబోతోంది. ..
నిర్మాత సోదరుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘శశి మూవీ రావడానికి ఎంతో మంది కష్టపడ్డారు. ప్రతీ ఒక్కరూ చాలా ఇష్టపడి చేశారు. ఈ సినిమాను ఇష్టపడుతూ కష్టపడి చేశారు.. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. చిరంజీవి గారు టీజర్, పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ రిలీజ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పాటలు వినడం కంటే చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ముగ్గురం నిర్మాతలమైన అసలు నిర్మాత మాత్రం వర్మ గారు. ప్రతీ ఫ్రేమ్‌లో ఆయనే కనిపిస్తుంటారు. ఈ సినిమా కోసం సాయి కుమార్ పడినంత కష్టం మరొక్కరు పడలేదు. నటుడిగా కంటే క్రికెటర్‌గా నాకు ఎక్కువగా తెలుసు. అండర్ 19 రంజీ టీంకు సెలెక్ట్ అయ్యారు. ప్రేమకావాలి సినిమాతో హిట్ కొట్టారు.. మళ్లీ ఈ మూవీతో మరో హిట్ రాబోతోంది. మార్చి 19న ఈ మూవీ రాబోతోంది అందరూ చూడండి’ అని అన్నారు.