Shakeela:శృంగార తార షకీలా అంటేనే ఓ సంచలనం.. మలయాళ ఇండస్ట్రీని తన శృంగార భరిత చిత్రాలతో ఓ ఊపు ఊపి అక్కడి స్టార్ హీరోలుగా ఉన్న మోహన్‌లాల్, మమ్ముట్టిలకు చెమటలు పట్టించింది షకీలా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా.. తన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో తన వివాహం గురించి మాట్లాడుతూ.. ఒకసారి నాకు పెళ్లి కుదిరింది.. మ్యారేజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.
అమ్మ చనిపోయిన తర్వాత అన్ని ఆ వ్యక్తే అనుకున్నాను. కానీ పెళ్లి రొక్కా మీద పేర్లు రాసేందుకు వాళ్ల అమ్మ వస్తుండగా.. ఆ టైంలో అతను తాగేసి.. నువ్ సిగరెట్ తాగితేనే పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంతే పక్కన ఉన్న హ్యంగర్ తీసి అతన్ని కొట్టా.. ఆ సమయంలో మా ఇద్దరికి వాగ్వాదం చోటుచేసుకుంది. అతన్ని పెళ్లి చేసుకోను అని చెప్పా. అలా నా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.. కాకపోతే పెద్ద బంగ్లా రాసిస్తా అని వాళ్ల అమ్మ అన్నారు.. ఆ బంగ్లా మధ్యలో నేను ఉరేసుకొని చావాలా? అని అన్నా.. కానీ ఇప్పటికీ ఆ కుటుంబంలోని వారందరూ నాతో మాట్లాడుతూనే ఉంటారు అని షకీలా తన పాత రోజులను గుర్తుచేసుకుంది. తన తల్లి గురించి చెబుతూ.. తన కన్నతల్లే తన జీవితంలో పెద్ద విలన్ అని.. చిన్నతనంలోనే తనని హోటల్ గదికి వెళ్లమందని.. అలాగే ఇటీవలే వచ్చిన తన బయోపిక్ చిత్రంపై.. ఆటో బయోగ్రఫీ అంటే అన్నీ అబద్ధాలు చెప్పడం కాదు కదా.. నిజాలు చెప్తేనే నాలా తప్పులు చేయరు అని షకీలా చెప్పుకొచ్చారు.