
మంచి విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తూ మోహన్ లాల్ , మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్న కన్నప్ప చిత్రంలో ప్రభాస్ కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ తెలియజేసింది. ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుండి చిత్ర యూనిట్ ఒక సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చింది. ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ ను ఫిబ్రవరి మూడో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అప్డేట్ తో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి అనేక నటీనటుల పాత్రలు, అలాగే వారి లుక్స్ వీటిలో చేసిన చిత్ర బృందం ఇప్పుడు ప్రభాస్ లుక్ విడుదల చేస్తున్నామని తెలియజేసిన వెంటనే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ మరింత పెరుగుతూ వచ్చింది.