సీనియర్ నిర్మాత కన్ను మూత

సీనియర్ నిర్మాత అలాగే రచయిత ప్రసిద్ధి చెందిన వి మహేష్ గారు (85) గుండె పోటుతో కన్నుమూశారు. నందమూరి తారక రామారావు, సుమన్, చిరంజీవి గార్లు వంటి ఎంతో ప్రముఖ కథ నాయకులతో మహేష్ గారు పని చేసిన సంగతి అందరికి తెలిసినదే. ఎన్టీయార్ గారితో ‘మనుషులంతా ఒక్కటే’, ‘మహాపురుషుడు’ చిత్రాలను నిర్మించారు. అలాగే చిరంజీవి గారితో ‘సింహపురి సింహాం’; సుమన్ గారితో ‘ముసుగు దొంగ’ చిత్రాలను ఆయన నిర్మించారు. ఎన్టీఆర్ తో కలిసి చేసిన ‘మానుషలంతా ఒక్కటే’ చిత్రానికి మహేష్ గారు కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు. ఎస్.వి.బి.సి. భక్తి ఛానల్ లో ‘హరి భక్త కథలు’ ధారావాహికకు రచన చేసి, నిర్మించారు. బంగారు నందితో పాటు మూడు విభాగాలలో ‘హరి భక్త కథలు’కు నంది అవార్డులు అందుకున్న ఘనత మాహేష్ గారిదే.
ఈరోజు చెన్నైలో మహేష్ గారి అంత్యక్రియలు జరగనున్నవి. ఆయన మరణానికి గాను తెలుగు సినీ, టీవీ రంగ ప్రముఖులు సంతాపం తెలియచేసారు.