బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్ ఫిక్స్?

balakrishna new movie

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సింహా, లెజెండ్ వంటి సినిమాల తరువాత కలిసి చేస్తున్న ఈ బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అనేక రకాల రూమర్స్ పూట్టుకొస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య అఘోరా పాత్రలో కనిపిస్తాడని ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక టాక్ వైరల్ గా మారింది.

ఎప్పటిలానే బాలయ్య బోయపాటి సినిమాలో ద్విపాత్రాభినయంతో మెప్పిస్తాడాని చిత్ర యూనిట్ నుంచి కూడా కొన్ని విషయాలు లీక్ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో జయప్రద ఒక కీలక పాత్రలో కనిపించనుందట. సీనియర్ బాలయ్యకు భార్య పాత్రలోనే కాకుండా యంగ్ బాలయ్యకు తల్లిగా కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా రెండు విభిన్నమైన పాత్రలతో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక సెకండ్ హీరోయిన్ కోసం ప్రస్తుతం దర్శకుడు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు టాక్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.