Tollywood: దివంగ‌త ప్ర‌ముఖ న‌టుడు కాంతారావు భార్య క‌న్నుమూత‌..

Tollywood: టాలీవుడ్ దివంగ‌త ప్ర‌ముఖ న‌టుడు కాంతారావు భార్య హైమావ‌తి(87) ఇక లేరు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కాంతారావు ఎంతో గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు.. క‌త్తి వీరుడు కాంతారావు అనేలా సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానం సంపాదించుకున్నారు. 2009 మార్చి 22న‌ ఆయ‌న క‌న్న‌మూయ‌గా.. తాజాగా కాంతారావు భార్య హైమావ‌తి హైద‌రాబాద్‌లోని మ‌ల్లాపూర్‌లో త‌మ నివాసంలో ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

kaantharao wife died

Tollywood ఇక కాంతారావు గారికి హైమావ‌తి రెండో భార్య‌, ఆయ‌న మొద‌టి భార్య ఆనారోగ్యం పాల‌వ్వ‌డంతో రెండో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంత‌రం కొంత కాలానికే మొద‌టి భార్య మ‌ర‌ణించింది. కాంతారావు Tollywood టాలీవుడ్‌లో జాన‌ప‌ద క‌థానాయ‌కుడిగా వంద‌లాది చిత్రాల్లో న‌టించి.. ఎన్టీఆర్‌, అక్కినేని హావా త‌ట్టుకుని త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కాంతారావు-హైమావ‌తి దంప‌తుల‌కు న‌లుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా కాంతారావు చివ‌రి రోజుల్లో చాలా ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. దీంతో కాంతారావు కుటుంబానికి తెలంగాణ ప్ర‌భుత్వం రూ.10వేలు ఫించ‌న్ అందిస్తోంది.