Chennai: తమిళ సీనియర్ నటి జయచిత్ర కుమారుడు ఆమ్రేష్ను చెన్నై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తిని రూ. 26కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అమ్రేష్ తన స్నేహితులతో కలిసి చెన్నైలోనిChennai వలసరవాక్కంకు చెందిన నెడుమారన్‌ను 7సంవత్సరాల నుంచి మోసం చేస్తునే ఉన్నారు. అతనికి మాయ మాటలు చెప్పి.. తమ వద్ద రైస్ పుల్లింగ్ కలశం ఉందని.. దీంతో జీవితం మారిపోతుందని అతన్ని నమ్మించారు.
పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఆ కలశాన్ని నెడుమారన్ తీసుకున్నారని తెలిపారు. కొంతకాలం పాటు తన ఇంట్లో ఉంచుకున్నా..కానీ ఎటుంటి ఉపయోగం లేదని ఆయన గ్రహించారు. దీంతో అమ్రేష్ తనను మోసం చేశాడని భావించిన నెడుమారన్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో అమ్రేష్‌ను, తన స్నేహితులను అరెస్ట్ చేశామని.. Chennai ఎగ్మూరులోని సీబీసీఐడీ కోర్టులో అతడిని ప్రవేశ పెట్టడం జరిగింది తెలిపారు. ఇక అమ్రేష్ పలు తమిళ చిత్రాల్లో కూడా నటించారు.