“RRR” ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ముస్లిం లుక్ పోస్టర్ సినిమా యూనిట్ రిలీజ్ చేయడం తెలిసిందే. దీంతో కొమురం భీమ్ ముస్లిం లుక్ లో ఉన్నాడేంటి అని ఆడియన్స్ కన్ఫ్యూజన్ లో పడ్డారు. చాలా డౌట్స్ రైజ్ చేసిన ఈ పోస్టర్ గురించి ట్రిపుల్ ఆర్ సినిమాకి స్టోరీ అందించిన స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
ఆర్ ఆర్ ఆర్ స్టోరీ హైదరాబాద్ తో కాస్త లింక్ అయ్యి ఉంటుందని అప్పట్లో ఈ ప్రాంతాన్ని నిజాంలు పాలించేవారు కాబట్టి, నిజాం పోలీసుల నుండి తప్పించుకోవటానికి కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ ముస్లింగా వారి సాంప్రదాయ దుస్తులు వేసుకోని తప్పించుకుంటాడట. ట్రిపుల్ ఆర్ సినిమాలో జస్ట్ అది ఒక చిన్న సన్నివేశం మాత్రమే దీనిపై వివాదాలు విమర్శలు చేసుకునే అంత విషయం ఏమీ లేదని విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అలాగే అల్లూరి సీత రామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ కూడా పోలిస్ గెటప్ లో కనిపించడానికి ఒక సర్ప్రైస్ ఉందని చెప్పారు. ఈ సర్ప్రైస్ ఏంటో మరో తెరపైనే చూడాలి. ఆర్ ఆర్ ఆర్ కొమురం భీమ్, అల్లూరి సీత రామరాజుల పై తెరకెక్కిస్తున్న కల్పిత కథ అనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన మ్యాటర్.
ఇదిలా ఉంటే ఈ సినిమా అక్టోబర్ 13వ తారీకు రిలీజ్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఆగస్టు ప్రారంభం నుండి స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో.. జరిగినట్లు ఇండస్ట్రీ టాక్. ఇదే తరహాలో ఇటీవల మేకింగ్ వీడియోకి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో.. సినిమా యూనిట్ కూడా ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి పై సంతోషం వ్యక్తం చేస్తోంది.