శ్రీముఖి డాన్స్ ఇరగదీసింది

యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్.. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది.. తాజాగా ఈ చిత్రం నుండి “క్రేజీ అంకుల్స్” టైటిల్ సాంగును సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదలచేశారు.

తాజాగా విడుదలైన ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా శ్రీముఖి వేసిన స్టెప్పులు ఈ సాంగ్ కు హైలెట్ గా నిలిచాయి.. రఘు కుంచే అందించిన సంగీతం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ.. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు RRR అనే ముగ్గురు అంకుల్స్ కలిసి ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది.. ఈ క్రేజీ అంకుల్స్ తో శ్రీముఖి ఎలా ఆడుకుందో సినిమాలో తెలుస్తోంది. ఈ కామెడీ రైడ్ త్వరలోనే థియేటర్స్ లో విడుదల కావడానికి రెడీగా ఉంది.