కృష్ణ విజయ నిర్మల పెళ్లికి కారణం ఆయనే…

1967లో బాపు-రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణ కథానాయకుడిగా, విజయనిర్మల కథానాయకిగా నటించింది. ఆ తర్వాత సర్కార్ ఎక్స్‌ప్రెస్ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ విజయనిర్మలను ప్రేమిస్తున్నానని పెళ్ళిచేసుకుంటానని చెప్పాడు. పరస్పర అంగీకారంతో మరో రెండేళ్ళకు 1969లో తిరుపతిలో పెళ్ళిచేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణ విజయనిర్మల కాంబినేషన్ లో 47 సినిమాలు వచ్చాయి. ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక హీరో హీరోయిన్ కలిసి ఇన్ని చేయడం ఇదే మొదటిసారి చివరి సారి కూడా. అయితే సాక్షి సినిమాలోనే కృష్ణ విజయ నిర్మల పెళ్లి సన్నివేశం ఉంది. దాన్ని బాపుగారు పులిదిండి గ్రామంలోని ఆలయంలో చిత్రీకరించారు.

ఈ సన్నివేశ చిత్రీకరణ సమయంలో అక్కడే ఉన్న నటుడు రాజబాబు పులిదిండి గ్రామ దేవుడు మహత్యం ఎక్కువని ఆయన ఎదురుగా పెళ్ళి చేసుకుంటే నిజమవుతుందని ఆటపట్టించాడట. ఏ దేవుడు తధాస్తు అన్నాడో తెలియదు కానీ ఈ చిత్రీకరణ జరిగిన రెండేళ్ళకే కృష్ణ విజయనిర్మల పెళ్లి చేసుకున్నాడు. తిరుపతిలో పెళ్ళాడినా కూడా పులిదిండి గ్రామ దేవుడు సెంటిమెంట్ ని నమ్మి కృష్ణ విజయనిర్మల వచ్చి మరీ దేవుడిని దర్శించుకున్నారు. కొన్నిసార్లు అంతే తల రాతలు ఎక్కడ రాసి ఉంటే జీవితాలు అక్కడికే చేరుతాయి.