సీక్రెట్ గా పవన్ హీరోయిన్ పెళ్లి…

పెద్ద పెద్ద కళ్లు వేసుకోని… బాపు గారి బొమ్మలా ఉంటూ తెలుగు ప్రేక్షకులకి దెగ్గరైన హీరోయిన్ ప్రణీత. తనీష్ నటించిన ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ, సిద్దార్థ్ బావ సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. పవర్ స్టార్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రణీత, ఎన్టీఆర్ తో కలిసి రభస సినిమా చేసింది. మహేశ్ బాబుతో బ్రహ్మోత్సవం చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రణీత. తెలుగు కన్నడ సినిమాలని బాలన్స్ చేస్తూ కెరీర్ సాగించిన ప్రణీత పెండ్లి పీటలెక్కింది. మే 30 2021న వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణీత వివాహం చేసుకుంది. బెంగళూరులో జరిగిన వెడ్డింగ్ సెర్మనీకి కుటుంబసభ్యులు, స్నేహితులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వచ్చారు. ఇది లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ అట. నితిన్ కి ప్రణీతకి ముందు నుంచే పరిచయం ఉందని, తమ బంధాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న తరువాత ఇంట్లో విషయం చెప్పి ఒప్పించి, వాళ్ల అంగీకారంతోనే ఈ పెళ్లి జరిగిందట. సీక్రెట్ గా జరిగిన ఈ పెళ్లితో ప్రణీత అందరికీ షాక్ ఇచ్చింది. ప్రణీత-నితిన్ రాజు వెడ్డింగ్ కు సంబంధించిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం హిందీలో హంగామా 2, భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. లాక్ డౌన్ లో పెళ్లి చేసుకోని ప్రణీత చాలా మంది అభిమానులకి స్వీట్ సుర్ప్రైస్ ఇచ్చింది.