‘ప్రేమిస్తావా’ సినిమాకు స్క్రీన్స్ పెరుగుతున్నాయి : డైరెక్టర్ విష్ణు వర్ధన్

ఆకాష్ మురళి, అదితి శంకర్(స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె) జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.  మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ‘ప్రేమిస్తావా’ అనే టైటిల్ తో జనవరి 31న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన ఈ సినిమా అందరినీ అలరించి సూపర్ హిట్ అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.  

సక్సెస్ మీట్ లో హీరో ఆకాష్ మురళి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ముందుగా ఆడియన్స్ సపోర్ట్ కి థాంక్. నన్ను తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతో ప్రేమతో వెల్ కమ్ చేయడం ఆనందంగా వుంది. చాలా మంది ఆడియన్స్ ఇది నా డెబ్యు సినిమాలా అనిపించడం లేదని చెప్పడం గొప్ప కాంప్లిమెంట్ గా భావిస్తున్నాను. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందంగా వుంది. తెలుగులో సినిమాలు చేయాలని వుంది. ఇంత ప్రేమని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ సో మచ్. ఇందులో లవ్ స్టొరీ అందరూ రిలేట్ చేసుకునేలా వుందనే కాంప్లిమెంట్స్ రావడం ఆనందంగా వుంది. చేజ్ సీన్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా మీ అందరికీ నచ్చడం చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అన్నారు.

డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు లో సినిమా చాలా అద్భుతంగా రీచ్ అయ్యింది. స్క్రీన్స్ పెరుగుతున్నాయని మైత్రీ వారు చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. మాకు సపోర్ట్ చేసిన మీడియాకు, ఆడియన్స్ కు థాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే వుండాలని కోరుకుంటున్నాను. రిలేషన్షిప్ నేపధ్యంలో జరిగే రొమాంటిక్ డ్రామా ఇది. పోర్చుగల్ లొకేషన్ తీసిన సీన్స్ చాలా భారీ ఖర్చుతో తీయడం జరిగింది. జైలు సెటప్ కూడా అద్భుతంగా వుంది. యాక్షన్ సీన్స్ చేయడం చాలా డిఫికల్ట్. ఇందులో వుండే క్రైమ్ ఎలిమెంట్ అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. ఆకాష్ చాలా ట్యాలెంటెడ్. చాలా చక్కగా నటించాడు. తనే రియల్ గా స్టంట్స్ చేశాడు. అదితి శంకర్ అద్భుతంగా నటించింది. కల్కి నటన ఈ సినిమాకి మరో ఆకర్షణ. చాలా నేచురల్ గా చేసింది. లవ్ జోనర్ నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. రాబోయే సినిమా మరో కొత్త జోనర్ ట్రై చేయాలని వుంది.

నిర్మాత స్నేహ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరి సపోర్ట్ కు థాంక్ యూ. సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మంచి రివ్యూలు వచ్చాయి. మా టీం తరపున ఆడియన్స్ కి థాంక్ యూ సో మచ్’అన్నారు.

తారాగణం: ఆకాష్ మురళి, అదితి శంకర్, ఆర్ శరత్‌కుమార్, ప్రభు, కుష్భూ సుందర్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: విష్ణు వర్ధన్
నిర్మాత: డాక్టర్ ఎస్ జేవియర్ బ్రిట్టో
సహ నిర్మాత: స్నేహ బ్రిట్టో
బ్యానర్: ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్
తెలుగు విడుదల: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రాఫర్: కెమెరాన్ ఎరిక్ బ్రిసన్
పీఆర్వో: వంశీ-శేఖర్