Sarangadariya: సారంగ దరియా సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే. పంటపొలాల్లో పాడుకునే ఓ ముసలావిడ నుంచి సేకరించిన ఈ సాంగ్ ఇప్పుడు వివాదం నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నాగచైతన్య అక్కినేని, సాయిపల్లవి జంటగా లవ్‌స్టోరి సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సారంగదరియా సాంగ్‌ను పెట్టారు.. ఈ సాంగ్‌లో సాయిపల్లవి డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. సుద్దాల అశోక్ తేజ Sarangadariya లిరిక్స్ అందించగా.. మంగ్లీ ఆలపించింది. దీంతో సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతుంది. సుద్దాల అశోక్‌తేజ, మంగ్లీ, సాయిపల్లవి లకు ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది సారంగదరియా. అలాగే లవ్‌స్టోరి సినిమాకు కూడా హైప్ వచ్చింది. అయితే అసలు ఈ జానపద సారంగదరియా సాంగ్‌ను పాడింది.. లిరిక్స్‌ను అందించింది కోమలికి మాత్రం గుర్తింపు దక్కలేదు.
ఈ విషయంపై ఇటీవలే డైరెక్టర్ శేఖర్ కమ్ముల వివరణ ఇచ్చిన.. కోమలి మాత్రం వెనకడుగు వేయట్లేదు. సారంగ దరియా సాంగ్ నాదని.. మంగ్లీతో ఎలా పాడించారని ప్రశ్నిస్తోంది కోమలి. అలాగే సారంగదరియా పాటను మార్చి రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.. నా పాటను మార్చి రాసి సుద్దాల అశోక్ తేజ క్రెడిట్ కొట్టేస్తున్నారని కోమలి విమర్శించింది. ఈ నేపథ్యంలోనే Sarangadariya కోమలి సారంగ దరియా సాంగ్‌పై తనకు జరిగిన అన్యాయంపై హైకోర్టులో తెలపాలని భావిస్తుంది కోమలి. తన అమ్మమ్మ దగ్గర సేకరించిన ఈ సాంగ్ నేను పాడితే బాగుంటుందని కాని వేరే వాళ్లు పాడితే ఎలా ఉంటుంది అని హైకోర్టులో్ తన భావనను తెలపనుంది కోమలి.