6వ రోజు ఆల్-టైమ్ రికార్డ్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’  

విక్టరీ వెంకటేష్ హోల్సమ్ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్-టైమ్ ఇండస్ట్రీ మైల్ స్టోన్ ని సాధించింది, 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 12.5 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 16.12 కోట్ల షేర్ సాధించింది. తెలుగు సినిమా 6వ రోజు కలెక్షన్స్ లోసంక్రాంతికి వస్తున్నాం కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది, రాజమౌళి RRR 6వ రోజు 9 కోట్ల షేర్‌ను అధిగమించింది. అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ మార్కును దాటింది.

ఈ చిత్రం నార్త్ అమెరికాలో 2 మిలియన్ల మార్కును దాటడం ద్వారా ఓవర్సిస్ లో కూడా బిగ్ రెవెన్యూ సాధిస్తోంది. పూర్తి రన్ ముగిసే సమయానికి ఇది 3 మిలియన్ల మైలురాయిని ఈజీగా దాటుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే నార్త్ అమెరికాలో వెంకటేష్‌కు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది, ఈ ప్రాంతంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు కూడా ఇది కొత్త రికార్డు.