అస్వస్థతకు గురైన సంజయ్ దత్.. కరోనా టెస్టులో నెగిటివ్

బాలీవుడ్‌ సీనియర్ నటుడు సంజయ్‌ దత్‌ శనివారం రాత్రి కొంత అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన సంజయ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇక ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు చేయగా సంజయ్‌ దత్‌కు నెగెటివ్‌ వచ్చింది.

ఇక సంజయ్‌ దత్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అలాగే సంజయ్ కూడా సోషల్ మీడియా ద్వారా ఆరోగ్యం పరిస్థితిపై వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక కోవిడ్ 19 టెస్టులో నెగిటివ్ వచ్చిందని రెండు రోజుల్లో ఆరోగ్యంగా మళ్ళీ ఇంటికి చేరుకుంటానని అన్నారు. ఇటీవల సంజయ్ దత్ తన 61వ పుట్టినరోజు సెలబ్రెట్ చేసుకున్న విషయం తెలిసిందే.