గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కేజీఎఫ్-2 బాలీవుడ్ ఉస్తాద్ ‘సంజయ్ దత్’ మొక్కలు నాటారు!!

ప్రకృతిని ప్రేమించే చేతులన్ని ఒక్కటవుతున్నాయి. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను అందుకొని మొక్కలు నాటుతూ భుజం భుజం కలుపుతున్నాయి. తల్లడిల్లుతున్న ప్రకృతిని తపనతో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. పచ్చని యజ్ఞం ప్రవాహంలా కొనసాగుతుంది. ఆసేతు హిమాచలం ఆసాంతం గ్రీన్ ఇండియాను అక్కున చేర్చుకుంటుందో. తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదిరిచూస్తుంది. ఇందులో భాగంగానే, పాన్ ఇండియా సంచలనం కేజీఎఫ్-2 బాలీవుడ్ ఉస్తాద్ సంజయ్ దత్, గచ్చిబౌలీలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ఈ రోజు 8 మొక్కలు నాటారు.


అనంతరం సంజయ్ దత్ మాట్లాడుతూ.. ఇది ప్రతీ ఒక్కరికి దగ్గరైన మంచి కార్యక్రమం. మనం నిర్వర్తించాల్సిన బాధ్యత “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. వారి కృషి ఫలించాలని ఆశిస్తున్నాను అన్నారు. ఇకపోతే ప్రతీ ఒక్కరు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలి, మొక్కలు నాటాలని కోరుకుంటున్నాం.