‘టక్ జగదీష్’ నుంచి ఏం వస్తుందో?

డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాడు నేచురల్ స్టార్ నాని. లాక్‌డౌన్‌లో ఓటీటీలో విడుదలైన ‘V’సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం నటిస్తున్న ‘టక్ జగదీష్‌’ సినిమాపై నాని భారీ ఆశలు పెట్టుకున్నాడు. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవ్వగా.. త్వరలో షూటింగ్ ముగిసే అవకాశముంది. ఈ సినిమాలో స్ట్రైలిష్ లుక్‌లో నాని కనిపించనున్నాడు. పెళ్లిచూపులు హీరోయిన్ రీతూశర్మ, ఐశ్వర్య రాజేష్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ సినిమాలను తీసిన శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

TUCK JAGADISH

షైస్ స్క్రీన్స్ పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. రేపు ఉదయం 10:53 నిమిషాలకు ఒక అప్డేట్ ఇవ్వనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ అప్డేట్ ఏమై ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీజర్ ఏమైనా రిలీజ్ చేస్తారేమోనని చాలామంది భావిస్తున్నారు. త్వరలో షూటింగ్ ముగియనుండటంతో వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా రైట్స్‌ను ఒక ప్రముఖ నిర్మాత రూ.47 కోట్ల భారీ రేటుకు హోల్‌సేల్‌గా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తం పెట్టి సినిమా రైట్స్‌ను దక్కించుకోడం ఆశ్చర్యకరంగా మారింది. V సినిమా ప్లాప్ అయినా సరే.. నాని ప్రస్తుతం చేస్తున్న టక్ జగదీష్ సినిమా ఇంతటి బిజినెస్ జరగడం గొప్ప అనే చెప్పుకోవాలి.