‘సముద్రుడు’ సినిమా రివ్యూ

నగేష్ నారదాసి దర్శకత్వంలో కీర్తన ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్స్ గా హీరో సుమన్, సమ్మెట గాంధీ, జబర్దస్త్ షేకింగ్ శేషు, చిత్రం శ్రీను, దిల్ రమేష్, సుమన్ శెట్టి తదితరులు కీలకపాత్రలో నటిస్తూ ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సముద్రుడు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా వాసు డిఓపిగా పనిచేశారు.

కథ:
సముద్ర తీరంలో నివసించే ఓ గ్రామంలోని మత్స్యకారులు చేపల వేటకై సముద్రం మీదకు వెళుతుంటారు. వారు సముద్రంలో వేటాడికి ఇచ్చిన ఆచాపలను దళారులు అమ్ముకుంటుండగా వారి కష్టానికి తగ్గ ఫలితం రావడంలేదని వాడే సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటారు. అయితే ఈ దళారులకు, మత్స్యకారులకు మధ్య జరిగే ఘర్షణ పరిస్థితులు నెలకొంటాయి. అదే సమయంలో హీరో సుమన్ ఆ ఊరికి పోలీస్ ఆఫీసర్ గా రావడం జరుగుతుంది. అదే సమయంలో ఆ ఊరిలో అందరూ చదువుకోవాలంటూ హీరోయిన్ కష్టపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా వారి సముద్రతీరంలోకి ట్యూన అనే చాప రావడంతో సినిమాలోని దళారుల కన్ను వాటిపై పడుతుంది. అయితే ఆ ట్యూన చేప కోసం ఈ చిత్రంలోని హీరో, ఆ గ్రామంలోని ప్రజలు పట్టుకోడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? ఆ ప్రయత్నాలలో ఎటువంటి కష్టాలను వారు ఆరోహిస్తారు? వారికి హీరో సుమన్ పోలీస్ ఆఫీసర్గా ఎటువంటి సహాయం చేస్తాడు? చివరిగా ఆ చేపలను వారు సాధిస్తారా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల నటన:
ఈ చిత్రంలో హీరోగా రమాకాంత్ ఓ మత్స్యకారుడుగా చాలా సాధారణంగా నటించడం జరిగింది. అలాగే హీరోయిన్ ఆ ఊరికి వచ్చిన టీచర్గా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ఈ సినిమాలో హీరో సుమన్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం పెద్ద ప్లస్ పాయింట్. అంతేకాక సమ్మెట గాంధీ, చిత్రం శ్రీను, దిల్ రమేష్, షేకింగ్ శేషు, సుమన్ శెట్టి తదితరులు తమ పాదాలకు పూర్తిగా న్యాయం చేస్తూ ఎంతో బాగా నటించారు.

సాంకేతిక విశ్లేషణ:
దర్శకుడు ఈ చిత్రానికి నటీనటులనే కాక పనిచేసిన సాంకేతిక బృందాన్ని కూడా చాలా బాగా ఎంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రానికి డిఓపి తన పనితీరుతో ఎంతో ప్రాముఖ్యతను సాధించాడు. అక్కడక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్క్రీన్ ప్లేకు తగినట్లు లేకపోయినప్పటికీ పాటలతో తన సంగీతాన్ని నిరూపించుకున్నాడు. నిర్మాణ విలువలు ఎంతో గొప్పగా ఉన్నాయి. సినిమాలో సుమారు అందరూ తెలిసిన ఆర్టిస్టులు కావడంతో సినిమా చాలా సులభంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. అక్కడక్కడ డప్పింగ్ కొంచెం సింక్ కానప్పటికీ ఆ కథ ఇంకా స్క్రీన్ ప్లే లో పెద్దగా ఎఫెక్ట్ అనిపించలేదు.

ప్లస్ పాయింట్స్ : హీరో సుమన్ స్క్రీన్ ప్రజెంట్, తెలిసిన నటీనటులు, నిర్మాణ విలువలు, పాటలు, సినిమాటోగ్రఫీ.

నెగటివ్ పాయింట్స్: అక్కడక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డబ్బింగ్.

సారాంశం :
యాక్షన్ డ్రామా జోనర్ లో వచ్చిన ఈ సినిమా ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ప్రేక్షకులకు పూర్తిస్థాయి కన్నుల విందుగా నిలిచేలా కుటుంబ సమేతంగా చూసేలా ఉంది.