కొత్త బిజినెస్‌లోకి సమంత

అక్కినేని కోడలు సమంత కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్యామ్ వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టి.. ఆ బిజినెస్‌ను సక్సెస్‌పుల్‌గా నడుపుతోంది. తాజాగా మరో కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సమంత ప్లాన్ చేస్తోంది. అదే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ బిజినెస్. ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసేందుకు హీరో నాగార్జున ప్లాన్ చేస్తున్నాడట. దాని బాధ్యతలు సమంతకు నాగార్జున అప్పగించనున్నాడట.

samantha

ఆ ఓటీటీ సంస్థ వ్యవహారాలను సమంత తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రముఖ టాలీవుడ్ నిర్మత అల్లు అరవింద్ ఆహా పేరుతో లాంచ్ చేసిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ బాగానే నడుస్తోంది. దీంతో ఓటీటీ ఇండస్ట్రీకి అడుగుపెట్టాలని నాగార్జున కూడా భావిస్తున్నాడట. ఇప్పటికే నాగార్జునకు అనేక బిజినెస్‌లో ఉన్న విషయం తెలిసిందే. హీరోగానే కాకుడా వ్యాపారవేత్తగా కూడా నాగార్జున ఫేమస్.

కరోనా ప్రభావం నేపథ్యంలో ఓటీటీలకు బాగా ప్రాచుర్యం లభించింది. ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసేందుకుప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఓటీటీ బిజినెస్‌ల వల్ల లాభాలు కూడా బాగానే వస్తున్నాయి. దీంతో నాగార్జున కూడా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించున్నాడట. సమంత ఇప్పటికే సినిమాలతో పాటు టాక్ షోలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. మరి నాగ్ పెట్టునున్న కొత్త ఓటీటీ యాప్‌ను సమంత సక్సెస్‌పుల్‌గా నడుపుతుందా?.. లేదా అనే చర్చ జరుగుతోంది.