Uppena: మెగా మేనల్లుడు సాయితేజ్ సోదరుడు పంజా వైష్ణవ్‌తేజ్ ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమయమవుతున్న విషయం తెలిసిందే. నేడు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా కొన్ని గంటలముందే తన ప్రియమైన తమ్ముడికి ప్రేమతో ఓ లేఖ రాశారు. ప్రియమైన తమ్ముడు వైష్ణవ్.. మొత్తానికిUppena నీ చిత్రం రిలీజ్ కాబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎంతో గర్వంగా కూడా ఉంది. నిన్నటికి నిన్న చిన్నపిల్లోడివి.. ఈ రోజు తెరపై కనిపించబోతున్నావు.
నాకు తెలుసు.. నీలో కొంత భయంగా, చాలా సంతోషంగా ఉన్నావు. నా మొదటి చిత్రం విడుదలైనప్పుడు నేను ఏ విధంగా కంగారుపడ్డానో ఆ రోజులు గుర్తులు వస్తున్నాయి. ఇండస్ట్రీలో నీ కెరీర్ ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి నీ ఈ ప్రయాణం సాఫీగా సాగుతుందని చెప్పలేను. కానీ, నీ కష్టానికి తగిన ప్రేమను ప్రేక్షకులు నీకు అందిస్తారుUppena. నీకు ఇదొక గొప్ప రోజు.. నీకే కాదు మా అందరికీ కూడా.. ఉప్పెన చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు. మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిన్ను Uppena తెరపై చూసేందుకు ఎంతో ఆత్రుతుగా ఎదురుచూస్తున్నానను అని ఆ లేఖలో సాయితేజ్ పేర్కొన్నారు.