‘ఉప్పెన’లో విజయ్ సేతుపతి డబ్బింగ్ అందుకే చెప్పలేదట

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో విజయ్ సేతుపతి నటన బాగుండగా.. వాయిస్‌పై విమర్శలు వస్తున్నాయి. విజయ్ సేతుపతికి డబ్బింగ్ వాయిస్ బాగాలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ సేతుపతి సొంతగా డబ్బింగ్ చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. అయితే సైరా నరసింహారెడ్డిలో తన పాత్రకు విజయ్ సేతుపతి డబ్బింగ్ చెప్పాడు. కానీ ఉప్పెలో విజయ్ సేతుపతి పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు బొమ్మాలి రవి శంకర్ డబ్బింగ్ చెప్పాడు.

vijay setupati dubbing

ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటనకు తగ్గట్లు వాయిస్ సెట్ అవ్వలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు దీనిపై స్పందించాడు. రాయనం పాత్రకు తన వాయిస్ సెట్ అవ్వదని విజయ్ సేతుపతి చెప్పారని, గతంలో ఆయనకు డబ్బింగ్ చెప్పిన నటుడు అజయ్, మరికొంతమందితో డబ్బింగ్ చెప్పిద్దామని అనుకున్నాం. కానీ చివరకు బొమ్మాలి రవి శంకర్‌ను ఫైనల్ చేశామన్నారు.