‘ఓదెల రైల్వేస్టేషన్` నుండి ప‌వ‌ర్‌ఫుల్ IPS ఆఫీస‌ర్ అనుదీప్‌గా ‘సాయిరోన‌క్’ లుక్ విడుద‌ల‌!!

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో సూప‌ర్ హిట్ చిత్రాల నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఓదెల రైల్వేస్టేష‌న్. మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన వ‌శిష్ట సింహ లుక్‌కి, రాధ‌ అనే ప‌ల్లెటూరి అమ్మాయిగా హెబా ప‌టేల్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ సినిమాలో ఒక ప‌వ‌ర్‌ఫుల్ IPS ఆఫీస‌ర్ అనుదీప్‌గా కీల‌క పాత్ర‌లో హీరో సాయిరోన‌క్ న‌టిస్తున్నాడు. ఈ రోజు ఆయ‌న లుక్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. గ‌న్ ప‌ట్టుకుని ఉన్న సాయిరోన‌క్ లుక్‌కి అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.
ఈ సంద‌ర్భంగా హీరో సాయి రోన‌క్ మాట్లాడుతూ – కె.కె రాధామోహ‌న్ గారిశ్రీ‌‌ స‌త్య‌సాయి ఆర్ట్స్ లాంటి పెద్ద బేన‌ర్‌లో, సంప‌త్ నంది గారి స్క్రిప్ట్‌తో, అశోక్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అనుదీప్ అనే ప‌వ‌ర్‌ఫుల్ IPS ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాను. ఈ సినిమా నటుడిగా నాకు మంచి గుర్తింపునిస్తుంద‌ని భావిస్తున్నాను. నాచురాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఒక‌ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపోందుతోన్న‌ ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది“ అన్నారు.
చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహ‌న్ మాట్లాడుతూ – “ ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌ల చేసిన హెబా ప‌టేల్‌, వ‌శిష్ట సింహ లుక్స్ అందరినీ ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు అనుదీప్ అనే ప‌వ‌ర్‌ఫుల్ IPS ఆఫీస‌ర్‌గా సాయి రోన‌క్ లుక్‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని న‌మ్మ‌తున్నాము. ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో వాస్తవికతకు దగ్గిరగా ఈ చిత్రం రూపొందుతోంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. “ అన్నారు.
వ‌శిష్ట‌సింహ‌, హెబా ప‌టేల్, సాయిరోన‌క్, పూజితా పొన్నాడ‌, నాగ‌మ‌హేష్‌(రంగ‌స్థ‌లం ఫేమ్‌), భూపాల్‌, శ్రీ‌గ‌గ‌న్, దివ్య సైర‌స్‌, సురేంద‌ర్ రెడ్డి, ప్రియా హెగ్దె త‌దిత‌రులు న‌టిస్తోన్నఈ చిత్రానికి

సినిమాటోగ్ర‌ఫి: ఎస్. సౌంద‌ర్ రాజ‌న్‌,
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌,
స‌మ‌ర్ఫ‌ణ‌: శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్,
నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్,
క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే: స‌ంప‌త్‌నంది,
ద‌ర్శ‌క‌త్వం: అశోక్ తేజ‌.