సాహో సాంగ్స్ మేకింగ్ వీడియో చూశారా

ప్రభాస్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన సాహో సినిమా తెలుగులో ప్లాప్ అయినా.. హిందీలో మాత్రం విజయం సాధించింది. హాలీవుడ్ లెవల్‌లో తీసిన ఈ సినిమాతో బాలీవుడ్‌లో ప్రభాస్‌కు మంచి పేరు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ పేరు తెచ్చుకున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ప్రభాస్-శ్రద్ధా కపూర్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.

SAHOO PRABHAS

ఇక సినిమాలోని యాక్షన్ సీన్లు హాలీవుడ్ లెవల్‌లో ఉంటాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్ మేకింగ్ వీడియోలు తాజాగా విడుదలయ్యాయి. సినిమా యూనిట్ వీటిని విడుదల చేయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆస్ట్రేలియాలోని ఇన్స్‌బ్రక్‌లో చేసిన షూటింగ్‌ను ఈ వీడియోలో చూపించారు. ‘ఇన్స్‌బ్రక్‌లో షూటింగ్ ఓ అద్భుత అనుభవం. అక్కడి వాతావరణం, మంచి మనసున్న మనుషులు, అద్భుత కట్టడాలు సూపర్. మా షూటింగ్‌ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ఇన్స్‌బ్రక్ అంటూ ప్రభాస్ చెప్పాడు.

ఈ సినిమాతో తెలుగులో ప్లాప్ అయినా హిందీలో హిట్ కావడంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి. బాహుబలి లాంటి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకులు భారీగా అంచనాలు వెలువడ్డాయి. కానీ బాహుబలి రేంజ్‌లో సినిమా లేకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు.