ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరి తరువాత మరొకరు పెళ్లికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా పెళ్లి అంటేనే దూరంగా పరుగెత్తిన హీరోలు వయసు మరింత పెరగక ముందే బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టేస్తున్నారు. నిఖిల్, నితిన్, రానా ఇటీవల వారికి నచ్చిన అమ్మయిలను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి….
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2020
More details tomorrow at 10AM pic.twitter.com/5PJZIPuVJu
ఇక అదే బాటలో సాయి ధరమ్ తేజ్ కూడా పయనిస్తున్నాడు. ఒక వాట్సాప్ గ్రూప్ లో నిఖిల్, రానా, నితిన్ సింగిల్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెడుతూ గ్రూప్ నుంచి లెఫ్ట్ అవుతున్నట్లు ఉంది. అలాగే సాయి కూడా.. “ఇట్స్ షో టైమ్.. ప్రభాస్ అన్నా క్షమించు” అంటూ తాను కూడా సింగిల్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టె సమయం వచ్చిందని అన్నాడు. ఆగస్ట్ 24వ తేదీన ఉదయం 10గంటలకు అసలు విషయం చెబుతానని.. ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి….అని ట్వీట్ చేసిన విధానం చూస్తుంటే సాయి ఎలాంటి న్యూస్ చెబుతాడో అని అందరూ ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు.