నూతన సంవత్సరం రోజు విషాదం – నాని ‘హిట్ 3’ షూటింగ్ లో ఘటన

నాచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం హిట్ 3. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ లో జరుగుతుండగా ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ చిత్రానికి పనిచేస్తున్న అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కె.ఆర్ కృష్ణ అనే మహిళ మృతి చెందడం జరిగింది. 30 సంవత్సరాల వయసులోని గుండెపోటుతో ఆమె మరణం చిత్ర బృందం అందరికి తీరని బాధని మిగిల్చింది.