వైరల్‌గా మారిన ‘RRR’ క్లైమాక్స్ పోస్టర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా RRR సినిమా యూనిట్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. RRR భారీ క్లైమాక్స్ షూట్ ప్రారంభమైందని సినిమా యూనిట్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టింది. మైటీ భీమ్, మండుతున్న రామరాజు కలిసి సాధించాలనుకున్నది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని ట్వీట్ చేసింది.

RRR CLIMAX POSTER

ఈ సందర్భంగా ఒక పోస్టర్‌ను RRR యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ చేతులు కలుపుతున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.