RRR బ్యాక్ టూ షూట్.. కొమురం భీమ్ డేట్ ఫిక్స్

బిగెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ కొమురం భీమ్ ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్ ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. లాక్ డౌన్ కారణంగా దాదాపు 6 నెలలు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.

ఇక సినిమా కోసం వేసిన సెట్స్ అన్ని కూడా దుమ్ము ధూళితో పాత బడడంతో చిత్ర యూనిట్ మొత్తాన్ని మళ్ళీ శుభ్రం చేసుకొని రెడీ చేసింది. ఇక కొమురం భీమ్ ఫస్ట్ లుక్ టీజర్ ని అక్టోబర్ 22న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. బులెట్ పై తారక్ వస్తున్నట్లు అర్ధమవుతోంది. చూస్తుంటే ఎన్టీఆర్ లుక్ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. దానికి తోడు కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచి కిక్కిచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా చిత్ర యూనిట్ మంచి సర్ ప్రైజ్ ఇస్తుందని అభిమానులు కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి దర్శకుడు రాజమౌళి ఎలాంటి కిక్కిస్తాడో చూడాలి.