పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. డేట్ ఫిక్స్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వివాహం గురించి గత కొంతకాలంగా అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఆమె తనకు కాబోయే భర్తపై క్లారిటీ ఇవ్వడమే కాకఉండా పెళ్లికి సంబంధించిన తేదీని కూడా చెప్పేసింది. నిన్ననే ఈ న్యూస్ వైరల్ అవుతుండగా కాజల్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసింది.

అక్టోబర్ 30న వివాహం జరగనున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించిన కాజల్ ముంబైలోనే ప్రయివేట్ గా వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గౌతమ్ కిచ్లు అనే పారిశ్రామికవేత్తతో పెళ్లి ఫిక్స్ అయినట్లు కాజల్ చాలా క్లియర్ గా వివరణ ఇచ్చింది.
గౌతమ్ కిచ్లు ఇంటీరియర్ కంపెనీ “డిసర్న్ లివింగ్” అనే సంస్థను కలిగి ఉన్నారు. ఇక వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఇక కాజల్ బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి యొక్క “ఆచార్య” మరియు కమల్ హాసన్ యొక్క “ఇండియన్ 2” లను కూడా పూర్తి చేయాల్సి ఉంది. కాజల్ అగర్వాల్ వయసు 35. ఇక ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ తన ప్రియుడిని నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అమెకు ఒక బాబు కూడా ఉన్నాడు.