వర్మ, విజయ్ దేవరకొండని తిట్టాడా? పొగిడాడ?

రౌడీ బాయ్ గా, యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. సోషల్ మీడియా లో విజయ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో 1 కోటీ 25 లక్షల మంది ఫాలోవర్స్ పైగా సొంతం చేసుకుని సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా రికార్డు సృష్టించిన విజయ్ ఇప్పుడు ఫేస్ బుక్ లో కూడా కోటీ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకోవటం విశేషం. విజయ్ దేవరకొండ 10 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ‘‘లైగర్’’
మూవీ లో నటిస్తున్న విజయ్ త్వరలోనే ఆ షూట్ లో జాయిన్ అవుతాడు.

ఇదిలా ఉంటే కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. కరణ్ జోహార్ ప్రెజెంట్ చేస్తూ, పూరి జగన్నాధ్ తెరకెక్కిన ఫిల్మ్ లిగర్. టైగర్, లయన్ కి క్రాస్ చేస్తే పుట్టే జంతువుని లిగర్ అంటారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలోని కొన్ని సీన్స్ చూసిన వర్మ, “విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ మహేశ్ బాబు రవితేజ టైగర్ ష్రాఫ్ ల సూపర్ క్రాస్ బ్రీడ్ లా ఉన్నాడు. ఇంతటి స్క్రీన్ ప్రేజేన్స్ 20 ఏళ్లలో ఏ స్టార్ హీరోలో కనిపించలేదు” అంటూ ట్వీట్స్ చేశాడు. వర్మ పోస్టులు చూసిన వాళ్లు ఆర్జీవి విజయ్ దేవరకొండని తిట్టాడా పొగిడాడ అంటూ ఆలోచనలో పడ్డారు. వర్మలో ఎటకారం ఎక్కువ కాబట్టి ఆయన పొగిడినా తిట్టినట్లు ఉంటుంది కాబట్టి రౌడీ బాయ్స్ కి ఆ అనుమానం వచ్చి ఉండొచ్చు కానీ లిగర్ సినిమా రష్ చూసి ట్వీట్ చేశాడు కాబట్టి వర్మ దేవరకొండని పోగిడినట్లే.