ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి సందేశాత్మక, కమర్షియల్ హిట్ చిత్రాలు అందించడమే కాకుండా కంటెంట్ వున్న చిత్రాలకు పెద్ద బడ్జెట్ అవసరం లేదని నిరూపించి టాలీవుడ్ లో ట్రెండ్ ని క్రియేట్ చేసిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం రొమాంటిక్ క్రిమినల్స్. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఏ సర్టిఫికెట్ తో ఈ చిత్రం సెన్సార్ సభ్యుల ప్రశంసలు పొందింది. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ చిత్రాలకి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేస్తున్నారు..ఈ సినిమా ని శ్రీ లక్ష్మీ పిక్చర్స్, శ్రావ్యా ఫిలింస్ బ్యానర్ల పై సంయుక్తంగా ఎక్కలి రవింద్రబాబు, బి.బాపిరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యెక్క పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం లో తొలిసారిగా నిర్మించిన పోస్ట్ ప్రోడక్షన్ స్టూడియో రిసాలి స్టూడియో లో జరిగాయి. విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు, ఒంటరి తనాన్ని పెంచుతూ మత్తు వైపు మళ్లిస్తున్న పరిస్థితులు, దళారుల కథనాల్ని, ఇంటర్నెట్ అశ్లీలతను చూపించారు. అలాగే వినోదం ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇందులో మనోజ్ నందం ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గా నటించాడు. అతిన్ని ఇష్టపడే సీనియర్ స్టూడెంట్ గా అవంతిక, డ్రగ్ పెల్లర్ గా వినయ్, 9వ తరగతి విద్యార్థిగా మౌనిక, కొత్తగా పెళ్లైన గృహినిగా దివ్య బాగా నటించారు. సున్నితమైన అంశాల్ని బోల్డ్ గా చూపించారు. ముసుగులు వేసుకున్న అమ్మాయిల కథ. మితిమీరిన వ్యసనాల్ని ఈ చిత్రంలో సున్నితంగా చర్చించారు. మ్యాంగో ఆడియో ద్వారా పాటలు విడుదల చేయనున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతల్లో ఒకరైన బి.బాపిరాజు మాట్లాడుతూ…. శ్రీ లక్ష్మీ పిక్చర్స్, శ్యావ్యాఫిలింస్ బ్యానర్ లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో గతంలో విడుదలయిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ తరహలో సీక్వెల్ గా రొమాంటిక్ క్రిమినల్స్ తెరకెక్కించాం. ఈ సినిమా పూర్తిగా నవ్యాంధ్రలో స్మార్ట్‌సిటీగా పేరుగాంచిన బ్యూటిఫుల్ సిటీ విశాఖపట్నంలో షూటింగ్ జరుపుకుంది. ముసుగుల వెనుక వున్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. గత రెండు చిత్రాల కంటే కూడా ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది. యువతని పట్టిపీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే ఈ కథ లో హీరోగా మనోజ్ నందన్, విలన్ గా వినోద్ , హీరోయిన్స్ అవంతిక, దివ్య, మౌనిక లు చాలా చక్కటి నటన కనబర్చారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి తోటలో పోలీసుల భద్రత మథ్య ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. వ్యసనాలు ఏమైనా వాటి పర్యవససానాలు తీవ్రంగా వుంటాయనే పాయింట్ ని… వినోదం పాళ్ళు తగ్గించకుండా మా దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టకుంటుంది ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలూ పూర్తి చేసుకొని ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమా ని మే 17న విడుదల చేస్తున్నాం. అని అన్నారు