కుటుంబంతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లిన రాకీభాయ్ య‌శ్..‌

క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ య‌శ్ హీరోగా తెర‌కెక్కిన కేజీఎఫ్ సినిమా ఎంతో ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. రాకీ భాయ్‌గా య‌శ్ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. అన్ని భాష‌ల్లో రిలీజ్ అయి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. దీంతో ఒక్క‌సారిగా య‌శ్ పాన్ ఇండియా సూప‌ర్‌స్టార్‌గా మారిపోయారు. ఇక కేజీఎఫ్-1కి సీక్వెల్‌గా వ‌స్తున్న కేజీఎప్‌-2 చిత్ర టీజ‌ర్ ఇటీవ‌లే య‌శ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ టీజ‌ర్ యూట్యూబ్ ట్రెండింగ్స్‌లో దూసుకుపోతుంది.

ఇక ప్ర‌శాంత్‌నీల్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో య‌శ్ జోడీగా శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ ర‌వీనా టాండ‌న్‌, స్టార్ హీరో సంజ‌య్‌ద‌త్ అధీరాగా క‌నిపించ‌నున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఇటీవ‌లే రాకీభాయ్ యష్ భార్య రాధిక పండిట్ కలిసి మాల్దీవులకు వెళ్లారు. టూర్‌లో భాగంగా స‌ముద్ర‌తీరంలో యష్-రాధిక కుమార్తె యారా-కొడుకు యాతర్వ్‌తో కలిసి ఫోటోలు దిగారు. దీంతో ప్ర‌స్తుతం వీరి ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి.