‘రెడ్’ నాలుగు రోజుల కలెక్షన్లు ఎంతో తెలుసా?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన రెడ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. తొలిరోజు రూ.5 కోట్లు రాబట్టగా.. మొత్తంగా నాలుగు రోజుల్లో రూ.22.70 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక రూ.13.59 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.

RED 4 DAYS COLLECTIONS

ఇక ఐదోరోజు రూ.1.16 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాంలో రూ.4.90 కోట్లు, సీడెడ్ రూ.2.45 కోట్లు, ఏపీలో రూ.5.75 కోట్ల షేర్ రాబట్టింది. థియేట్రికల్ రైట్స్ రూ.16 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇందులో రామ్ డబుల్ రోల్‌లో నటించగా.. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవి కోషోర్ దీనిని నిర్మించారు. ఇందులో నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు.