జబర్దస్త్ చూసే ప్రేక్షకులకు రీతూ చౌదరి అంటే కొత్త పరిచయం అవసరం లేదు. యాంకర్ అలాగే మంచి కామెడీ టైమింగ్ కలిసిన ఆర్టిస్టుగా బుల్లితెర ద్వారా ఆమె అందరికీ పరిచయమే. తనదైన శైలిలో కౌంటర్ వేస్తూ అలాగే సోషల్ మీడియాలో తన గ్రామర్ తో ఈమె ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అయితే గత ప్రభుత్వంలో జరిగిన 700 కోట్ల రూపాయల ల్యాండ్ స్కాంలో ఈమె కూడా ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి రీతు చౌదరి సీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తికి రెండో భార్య. అయితే అతడు ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి కావడంతో వారి ప్రభుత్వం సమయంలో వీరిద్దరూ మరి కొంతమందితో కలిసి విజయవాడ దగ్గరలోని ఇబ్రహీంపట్నం ఏరియాలో ఒక ల్యాండ్ స్కామ్ చేసినట్లు సింగ్ అనే వ్యక్తి ఇప్పటి ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడం జరిగింది. వీరిద్దరూ కలిసి తనను కిడ్నాప్ చేసి బలవంతంగా సంతకాలు పెట్టించుకుని సుమారు 700 కోట్ల రూపాయల ల్యాండ్ ను వారి పేర్ల మీదకు మార్చుకున్నట్లు ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ మేరకు వారిపై కేసు కూడా నమోదు అయినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే తెలుగు సిని పరిశ్రమలో ఎదుగుతున్న ఈమెకు ఈ చిక్కెదురు ఎటువంటి ప్రయాణాన్ని ఇస్తుంది అనేది తెలియాలి. అసలు నిజంగానే ఈమె ఆ స్కామ్ లో ఉన్నారా లేదా ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.