సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఒక్కసారిగా బాలీవుడ్ షాక్ కి గురైంది. చాలా మంది తారాలపై నెపోటిజమ్ కామెంట్స్ రావడంతో సోషల్ మీడియాలో స్పందించడానికి కూడా భయపడుతున్నారు. మొదట సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ వంటి స్టార్స్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక కొన్నిరోజుల తరువాత ఫోకస్ మొత్తం సుశాంత్ ప్రేయసి రియా వైపు మళ్లింది.
సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ రియాపై కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా నేషనల్ మీడియా కూడా ఎక్కువగా రియాపైనే ఫోకస్ చేసింది. అయితే తనను రాజకీయ అనుకూల మీడియా వర్గాలు కలిసి దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని రియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుశాంత్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వారిని ముందే దోషులుగా ఎలా నిర్ణయిస్తారని చెబుతూ.. విషయంలో రాజకీయ నాయకులు కూడా వారి స్వార్థం కోసం తనను బలి పశువును చేస్తున్నారని రియా పిటిషన్ లో పేర్కొంది.