ఆచార్యలో రామ్ చరణ్ యాక్షన్ రోల్.. ఎంతసేపు ఉంటుందంటే?

Ram-Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య సినిమాలో నటించనున్నట్లు షూటింగ్ మొదలవ్వక ముందు నుంచే టాక్ వస్తోంది. ఆ విషయంపై చిత్ర యూనిట్ ఇంతవరకు ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. దర్శకుడు కొరటాల కూడా మొదటి నుంచి సినిమాపై వస్తున్న రూమర్స్ గురించి పట్టించుకోవడం లేదు. ఇక దాదాపు మెగాస్టార్ ఆచార్యలో చరణ్ గెస్ట్ రోల్ లో ఎలాంటి అనుమానం లేదని తెలుస్తోంది.

ఇక ఆ పాత్ర ఎంత సేపు ఉంటుందనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి చరణ్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఆ పాత్ర 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉంటుందని టాక్. పూర్తిగా కథని మలుపు తిప్పే పాత్రలో చరణ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ నెల ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ రానుంది.