మరో బోల్డ్ పోస్టర్ వదిలిన ఆర్జీవి.. కొత్త హీరోయిన్ తో థ్రిల్లర్ మూవీ

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అనేలా ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఓ వైపు బోల్డ్ సినిమాలు మరోవైపు కాంట్రవర్సీ సినిమాలు చేస్తూ.. అభిమానులకు షాక్ ఇస్తున్నాడు. ఏం చేసినా కూడా వర్మ డోస్ మాత్రం తగ్గడం లేదు. ఇక ఈ సీనియర్ డైరెక్టర్ నెక్స్ట్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు.

అప్సర రాణి అంటూ ఇటీవల ఒక కొత్త బ్యూటీని ఆడియెన్స్ కి పరిచయం చేసిన ఆర్జీవి ఆ హీరోయిన్ తో థ్రిల్లర్ అనే సినిమా చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఫస్ట్ పోస్టర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేశాడు. అప్సర రాణి బోల్డ్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తోంది. ఇదివరకే ఒకసారి NNNతో హీటెక్కించిన వర్మ ఈ సారి థ్రిల్లర్ తో మరింత వేడెక్కించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.