మా ఇష్టం అందరిని అలరిస్తుంది -రామ్ గోపాల్ వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో  అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మా ఇష్టం. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా ఇద్దరమ్మాయిల ప్రేమకథతో వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర బృందం ఇప్పుడు హైదరాబాద్ లో ఈ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ తో పాటు అప్సర రాణి, నైనా గంగూలీ, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ తో పనిచేయడం ఎంతో కిక్ ఇస్తుంది. ఇంతటి అద్భుతమైన సినిమా ని వేరే ఏ డైరెక్టర్ చేయలేడు అని సగర్వంగా చెబుతాను. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలున్నారు. మా సినిమా లో ఇద్దరు కత్తిలాంటి హీరోయిన్ లు, అర్జీవి గారు ఉన్నారు. ఈ సినిమా తప్పకుండా యాభై కోట్లు కలెక్షన్స్ సాధిస్తుంది. ఒక సినిమా హిట్ అవ్వడానికి ఏవైతే కావాలో అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి అన్నారు. అన్ని భాషల్లో ఈ సినిమా ఏప్రిల్ 8 న విడుదల కాబోతుంది. అన్నారు.

హీరోయిన్ నైనా గంగూలీ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ గారితో గతంలో చాలా సినిమాలు చేశాను కానీ ఈ సినిమాలో నేను చేసిన లెస్బియాన్ రోల్ ఎంతో డిఫరెంట్ గా ఉంది. హీరో పక్కన నటించడం చాలా ఈజీ.. కానీ ఒక అమ్మాయితో రొమాన్స్ సీన్స్ లో నటించడం ఎంతో డిఫికల్ట్. ఈ సినిమా మొదట్లో ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత అందరి సప్పోర్ట్ తో బాగా చేయగలిగాను. ఒక నటి ఎలాంటి పాత్ర అయినా బాగా చేయాలనీ నమ్ముతాను. అందుకే ఇది పూర్తి చేయగలిగాను. ఈ సినిమా చేయడాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. మీ అందరు ఈ సినిమా ను సపోర్ట్ చేసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అన్నారు.

హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నటించడం ఆనందంగా ఉంది. వెరైటీ పాత్రలు చేయాలనేదే నా లక్ష్యం. అందుకే ఇలాంటి పాత్రలో నటించాను. ఈ కథ వినగానే చేయాలనిపించింది. ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే ఏంటి అనేది ఈ సినిమా. ఆయన సినిమాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా ఎవరు ఊహించని విధంగా ఉంది. రొమాంటిక్ పాట లో చేయడం ఎంతో థ్రిల్ అనిపించింది. అందరికీ థాంక్స్. అన్నారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. మా ఇష్టం సినిమా ఒక క్రైమ్ డ్రామా మూవీ. అందులో లీడ్ పెయిర్ లెస్బియన్స్. ఆ పాత్రలలో నైనా గంగూలీ, అప్సర రాణి ఇద్దరు అద్భుతంగా నటించారు. అప్సర నటించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు కానీ నైనా ని ఒప్పించడానికి కొంత సమయం పట్టింది. ఇద్దరు కూడా ఆ పేరెంట్స్ తో మాట్లాడి ఈ సినిమా చేశారు. వరల్డ్ లోనే ఇద్దరు అమ్మాయిలతో రొమాంటిక్ పాట షూట్ చేయడం జరగలేదు. ఏప్రిల్ 8 న ఈ సినిమా రాబోతుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.