అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ.50వేల చొప్పున రెండు పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

అయితే సాక్షులను ప్రభావితం చేయవద్దని, అలాగే కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దు అని ఆదేశించింది. అంతే కాకుండా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని శరతుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అయితే ఇప్పటికే ఈ విషయం పై ఎన్నో చర్చలు జరిగాయి. బాలీవుడ్ సెలబ్స్ నుండి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు ఇప్పటికే ఈ సంఘటన పై అల్లు అర్జున్ కు సానుకూలంగా స్పందించడం జరిగింది.