రెడ్ పప్పెట్ ప్రొడక్షన్ నంబర్ 1 టైటిల్ గా ‘గోదారి గట్టుపైన’ ఫిక్స్

మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్, ఒక ఎక్సయిటింగ్ న్యూ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈరోజు, నిర్మాతలు ఈ సినిమా టైటిల్ ‘గోదారి గట్టుపైన’ను రివిల్ చేశారు, ఇది సంక్రాంతికి వస్తున్నాం లోని హిట్ పాట ద్వారా ఇప్పటికే ప్రజాదరణ పొందిన టైటిల్. టైటిల్ లోగో విజువల్ ఎట్రాక్టివ్ గా వుంది, పోస్టర్ ప్రశాంతమైన గోదావరి ప్రాంతాన్ని అందంగా ప్రజెంట్ చేసింది . టైటిల్, పోస్టర్ రెండింటి డిజైన్ ప్లజెంట్ గా వుంది.

“ఒక చల్లని సాయంత్రం వేళ ప్రశాంతమైన గోదావరి నది ఒడ్డున మీ స్నేహితులతో కూర్చుని సమయం గడపడం ఎంత ప్రశాంతంగా ఉంటుందో? మా సినిమా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. రిలాక్స్‌గా, అందమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. గోదావరి జిల్లాల వేల్పూరు, రేలంగి, భీమవరం నేపథ్యంలో సెట్ చేయబడిన  స్వచ్ఛమైన చిత్రానికి గోదారి గట్టుపైన అని పేరు పెట్టారు. పశ్చిమ గోదావరి ప్రాంతంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలు సినిమా విజువల్ గ్రాండియర్ లో పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి” అని చిత్ర దర్శకుడు చెప్పారు.

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, వివా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ వంటి ప్రముఖ తారాగణం ఉంది. వీరందరూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకి సాయి సంతోష్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, నాగ వంశీ కృష్ణ సంగీతం సమకూరుస్తున్నారు, ప్రవల్య ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు, అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా,  నాగార్జున తాళ్లపల్లి సౌండ్ డిజైనర్‌.

ప్రస్తుతం గోదారి గట్టుపైన షూటింగ్ జరుపుకుంటోంది.

తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వివా రాఘవ్,రోహిత్ కృష్ణ వర్మ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – సుభాష్ చంద్ర
బ్యానర్ – రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
నిర్మాత – అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మధులిక సంచన లంక
DOP – సాయి సంతోష్
సంగీతం – నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ – అనిల్ కుమార్ పి
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్ – ప్రవల్య డి
పీఆర్వో – వంశీ-శేఖర్
మార్కెటింగ్ – ఫస్ట్ షో